కొవిడ్ వ్యాప్తి పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో శారీరకంగానే కాకుండా మానసికంగా ఆరోగ్యంగా ఉండటం ముఖ్యమని అంటోంది సమంత. మానసిక ఒత్తిడిని జయించాలంటే మనసులో ఉన్న భావాల్ని స్వేచ్ఛగా వ్యక్తీకరించడమొక్కటే మార్గమని చెబుతోంది.
కొవిడ్ కారణంగా వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎదురవుతున్న ఒత్తిడుల గురించి సమంత మాట్లాడుతూ ‘మనసులో అంతర్లీనంగా దాగి వున్న మంచిచెడుల్ని కుటుంబసభ్యులతో, స్నేహితులతో నిరంతరం చర్చిస్తూ ఉండాలి.
సలహాలు ఇచ్చేవారికంటే మన బాధను పంచుకునే వ్యక్తుల స్నేహాన్ని పొందగలిగితేనే ఒత్తిడుల నుంచి బయటపడుతాం. కరోనా మహమ్మారి కారణంగా ప్రతిఒక్కరి జీవనశైలిలో మార్పులొచ్చాయి. ఇదివరకు వృత్తిబాధ్యతల వెంట అనుక్షణం పరుగులు తీస్తుండేవాళ్లం.
ఆ పరుగును ఆపి జీవితాన్ని స్వీయవిశ్లేషణ చేసుకునే అవకాశం దొరికింది. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏం జరుగుతుందోననే వాస్తవాన్ని గ్రహించేలా చేసింది. మనల్ని విమర్శించేవారు మాత్రమే కాకుండా కష్టాల్లో ఉండే వారికి సాయపడే మంచి మనుషుల్ని ఈ క్లిష్ట సమయం పరిచయం చేసింది’ అని తెలిపింది