స్టార్ హీరో..యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ త్వరలో పొలిటీషియన్‌గా కనిపించబోతున్నారా.. అవుననే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రశాంత్ నీల్, ఎన్.టి.ఆర్ కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ విషయం వీరిద్దరు కన్‌ఫర్మ్ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఈ ప్రాజెక్ట్ గురించి క్లారిటీ ఇచ్చారు. ఇందులో తారక్‌ని పవర్ ఫుల్ పొలిటీషియన్‌గా ప్రశాంత్ నీల్ చూపించబోతున్నట్టు సమాచారం. ఇంతక ముందు ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్‌ని జవాన్‌గా చూపిస్తాడని వార్తలు వచ్చి వైరల్ అయ్యాయి.
తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఎన్టీఆర్ పొలిటికల్ లీడర్ పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. దీనిపై దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌తో సలార్ అనే భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కిస్తున్నాడు.
తారక్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చివరి దశకు చేరుకుంది. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇవి పూర్తయ్యాక ప్రశాంత్ నీల్, తారక్‌ల ప్రాజెక్ట్ సెట్స్ మీదకి రానుంది.