తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే పెద్ద మనసు చాటుకుంది.
కరోనాతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు అండగా నిలుస్తోంది. తాజాగా 100 నిరుపేద కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకుల్ని అందించింది.
లాక్డ్ డౌన్ కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు అండగా నిలిచింది. వాటన్నింటిని తనే స్వయంగా ప్యాక్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.