తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,సీఎం కేసీఆర్ నుండి కామన్ మ్యాన్ దాకా.. అందరినోటా అభినందనల మాట..అభివృద్ది..చిత్తశుద్ది..వ్యూహ చతురతకు అందరూ ఫిదా..ఉమ్మడిఖమ్మంపై తిరుగులేని ముద్ర.. అందరివాడుగా మారిన మంత్రి పువ్వాడ..సీనియర్లను మెప్పిస్తూ రాజకీయంగా రాటుదేలిన నేత..పువ్వాడపై యువనేత కేటీఆర్ ప్రశంసలు..
ఆయన నిజంగా సూపర్ మినిస్టరే. ముఖ్యమంత్రి నుండి కామన్ మ్యాన్ వరకు సీఎం టు సీఎం ఆయన కృషికి, వ్యూహచతురతకు, చిత్తశుద్దికి అసాధరణ విజయాలకు అభినందనలు కురిపిస్తున్నారు. ఎందరో రాజకీయ ఉద్దండులను చూసిన ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ విలక్షణం. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో యువకుడు..ఏం చేస్తాడులే అనుకున్న పరిస్థితి నుండి విమర్శకుల, ప్రత్యర్ధుల చేతే రాజకీయంగా రాటుదేలిన నేత, అజయ్ సామాన్యుడు కాదు.. అందరివాడు అనిపించుకోవడం అసామాన్యం.
రాజకీయంగా ఒంటిచేత్తో కళ్లుచెదిరే విజయాలు సాధించి, తనను ఇరుకునపెట్టాలనుకున్న అస్మదీయుల, తస్మదీయుల ఊహకు అందకుండా రాజకీయ పరిణతిని సాధించిన పువ్వాడ ఖమ్మం జిల్లా అభివృద్దిపై బలమైన ముద్ర వేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రమే కాకుండా ఇతర మంత్రులు కూడా పువ్వాడ అజయ్ అభివృద్ది పట్ల చూపే చిత్తశుద్దిని, లక్ష్యసాధన కోసం చివరినిమిషం దాకా చేసే చేసే శ్రమను చూసి ముగ్దులవుతారు. వెంగళరావు, తుమ్మల నాగేశ్వరరావు లాంటి హేమాహేమీలను చూసిన జిల్లాలో.. అతితక్కువ కాలంలోనే పువ్వాడ తనదైన ముద్రవేసి దూసుకుపోతున్నాడు.
రాజకీయ చతురత
తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు నుండి రాజకీయ ఓనమాలు నేర్చుకున్న అజయ్ స్వయంకృషితో అనూహ్యంగా ఎదిగారు. ఆయన కృషి, అంకితభావం, మేధస్సు ఎంతోమందికి రాని అవకాశాన్ని అందించింది. చాలామందికి పదవులొస్తాయి. కానీ వచ్చిన పదవులకు వన్నెతెచ్చేవారు అతిస్వల్పంగా ఉంటారు. అందులో పువ్వాడ అజయ్ ఒకరు. అనేకమంది ముఖ్యనేతలు సహాయ నిరాకరణ చేసినా.. ఖమ్మం లాంటి విలక్షణ రాజకీయాలు, మనస్తత్వాలు ఉన్న నగరంలో ఒంటిచేత్తో పువ్వాడ అజయ్ కార్పోరేషన్‌ను గెలిపించారు. టీఆర్‌ఎస్‌కు అపూర్వ విజయం అందించారు. ఖమ్మం కార్పోరేషన్ గెలుపుభారాన్ని భుజానవేసుకుని ఒంటిచేత్తో విజయతీరాలకు చేర్చిన పువ్వాడ.. సహకార ఎన్నికలతో పాటు ప్రతీ ఎన్నికల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు.
పువ్వాడ విజన్‌ను చూసి.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా ప్రోత్సహించగా, ఖమ్మం నగరంపై ప్రగతిపరిమళాలు కనిపిస్తున్నాయి. సిరిసిల్ల, సిద్దిపేటలకు ధీటుగా ఖమ్మం నగరం అబ్బురపడేరీతిలో.. వేలకోట్ల నిధులు సాధించుకుంది. మనసంతా ఖమ్మం అభివృద్దిని నింపుకున్న గత ఏడాది కాలంలో.. ఎన్నో అద్బుతాలు ఆవిష్కరించడంతో పాటు రాజకీయంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాపై గట్టిపట్టు సాధించారు. సీనియర్ నేతలను గౌరవిస్తూనే.. పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అందరినీ అక్కున చేర్చుకుంటున్నారు. పువ్వాడ నాయకత్వానికి మెచ్చి.. ఇతర పార్టీల నేతలు కూడా టీఆర్‌ఎస్‌లోకి క్యూ కడుతున్నారు.
పువ్వాడ అజయ్ ప్రస్తుతం రెండోటర్మ్‌లో సగం పదవీకాలం పూర్తిచేసుకోగా, మరో రెండు టర్మ్‌లు కూడా ఆయనే ఉండాలని.. ప్రజలు కోరుకునేంతగా ఖమ్మంలో మార్పుతెచ్చారు. ప్రజల హృదయాల్లో అజేయంగా నిలిచారు.
……..