నటి మీరా చోప్రా ఓ వివాదంలో చిక్కుకుంది. థానేలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఆమె ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
అయితే ఆమె ఫ్రంట్లైన్ వారియర్గా చెప్పుకుని తప్పుడు పత్రాలు చూపి వ్యాక్సిన్ తీసుకుందని BJP నేత ఒకరు ఇందుకు సంబంధించిన ఆధారాలు పోస్ట్ చేశారు.
దీంతో నెటిజన్లు ఆమెపై విమర్శలు చేస్తున్నారు. ‘బంగారం, వాన, మారో’ వంటి తెలుగు చిత్రాలతో పాటు ఎన్నో హిందీ, తమిళ చిత్రాల్లో మీరా నటించింది.