చాలా మందికి పొద్దున్నే టీ తాగనిదే పొద్దు గడవదు. అయితే మరీ హాట్ ఛాయ్్న తాగొద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వేడి వేడి టీ వల్ల అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని చెప్తున్నారు.
30 నుంచి 79 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిపై తొమ్మిదేళ్లు పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు… పొగ తాగడం, ఆల్కహాల్ అలవాట్లతో పాటు రోజూ వేడి వేడి టీ లేదా కాఫీ తీసుకునేవారిలో క్యాన్సర్ అవకాశాలు పెరిగినట్లు గుర్తించారు.