గ్రేటర్ హైదరాబాద్‌లో శుక్రవారం మొదటిరోజు స్పెషల్ కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతమైంది. హైరిస్క్ ఉన్న నిత్య సేవలకులకు 30 సర్కిళ్ల పరిధిలోని 31 కేంద్రాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీకాలు వేశారు.
ముందస్తుగా 30 వేల మందికి టోకెన్లు అందించగా.. 21,666 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. వీరిలో 44 ఏండ్లలోపు వయస్సువారు 15,963 మంది, 45 ఏండ్లు పైబడివారు 5,703 మంది ఉన్నారు.
మొదటి డోసుగా ప్రతి ఒక్కరికీ కొవిషీల్డ్ టీకా వేశారు. వ్యాక్సిన్‌నేషన్ ప్రక్రియను ప్రజాప్రతినిధులతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, అధికారులు నిరంతరం పర్యవేక్షించారు.
టీకా వేసుకున్నవారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రోజూ 30 వేల మందికి చొప్పున వచ్చే తొమ్మిది రోజుల పాటు ఈ స్పెషల్‌డ్రైవ్ కొనసాగనున్నది.