తెలంగాణలోని వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పట్టణంలో రూ.2 కోట్లవ్యయంతో నిర్మించిన మోడల్ వెజిటేబుల్ మార్కెట్ భవనాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు.
కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, జిల్లా కలెక్టర్ హరిత, స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మున్సిపాలిటీ చైర్ పర్సన్ రజీని తదితరులు పాల్గొన్నారు.