“ఫంగస్ మందు Ampoterisan ఈనెలాఖరుకి 3 లక్షలు, వచ్చేనెల మరో 3 లక్షలు వస్తాయి. మన దేశానికి చెందిన 11 కంపెనీలు ఈ ampoterisan ఉత్పత్తి చేస్తున్నాయి.
త్వరలో ప్రయివేట్ ఆసుపత్రులకు కూడా ఫంగస్ మందు అందుతుంది.వాక్సిన్ జనవరి నాటికి అందరికి అందుతుంది,అప్పటి వరకు అందరూ జాగ్రతగా ఉండాలి.నిత్యావసరాల ధరలు పెరగకుండా,బ్లాక్ చేయకుండా ఉక్కుపాదం మోపాలి.జూ.డాల కోరికలు న్యాయమైనవే.
జూడాలు,ప్రభుత్వం పట్టింపులకు పోకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించాలి.కరోన తగ్గినా దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి ఫంగస్ వస్తుంది,వారిని ఇంట్లోనే పెట్టుకొని కుటుంబ సభ్యులు జాగ్రత్తగా చూసుకోవాలి.వాక్సిన్,ఇంజక్షన్స్ ఆసుపత్రులు,ఆయా రాష్ట్రప్రభుత్వాలు ఇతర దేశాల నుంచి నేరుగా దిగుమతి చేసుకోవచ్చు,24 గంటల్లో కేంద్రం ఆమోదం ఇస్తుంది.
మీడియా కూడా ప్రజలను బయపెట్టకుండా కోవిడ్ జయించిన వారి కధనాలు ప్రసారం చేయాలి.125 బెడ్ల సామర్థ్యం ఉన్న ENT ఆస్పత్రి 250 మందికి పైగా వైద్యం అందిస్తుంది.”- కేంద్రమంత్రి G.కిషన్ రెడ్డి ENT ఆసుపత్రి సందర్శనలో పేర్కొన్నారు.