ఈ రోజుల్లో ఒక్క హిట్ వచ్చిందంటే చాలు హీరోయిన్లకు మంచి గుర్తింపు వచ్చేస్తుంది. కృతి శెట్టి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రస్తుతం ఈమె వరస సినిమాలతో బిజీగా ఉంది. కృతి తర్వాత జాతిరత్నాలు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఫరియా అబ్దుల్లా కూడా మంచి గుర్తింపే తెచ్చుకుంది. కానీ అవకాశాలు మాత్రం అంతగా రావడం లేదు. జాతిరత్నాలు సూపర్ హిట్ అవ్వడంతో దాదాపు అందరికీ గ్యాప్ లేకుండా ఆఫర్లు వచ్చాయి. ముఖ్యంగా హీరో నవీన్ పొలిశెట్టి అయితే ఇప్పుడు స్టార్ అయిపోయాడు. వరుస అవకాశాలు రావడంతో బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చినా కూడా కాదంటున్నాడు. మరోవైపు ప్రియదర్శి, రాహుల్ కూడా చాలా బిజీ అయిపోయారు. కానీ హీరోయిన్ మాత్రం ఎందుకో క్లిక్ కావడం లేదు.
షార్ట్ ఫిలింస్ చేసి సినిమాల వైపు వచ్చిన ఫరియా అబ్దుల్లాకు ఇప్పుడు ఎందుకో అవకాశాలు మాత్రం ఊహించినట్లుగా రావడం లేదు. దానికి ఆమె హైట్ ప్రధాన కారణం. టాలీవుడ్‌లో ఉన్న దాదాపు చాలామంది హీరోల కంటే హైట్ ఎక్కువగా ఉంది ఫరియా. తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ హైట్ ఉన్న హీరోయిన్‌గా గతంలో అనుష్క ఉండేది కానీ ఇప్పుడు మాత్రం ఫరియా అబ్దుల్లా ఆ టాప్ ప్లేస్ అందుకుంది. ఇదే ఈమెకు శాపంగా మారుతుంది.
దానికితోడు తొలి సినిమాలో అందాల ఆరబోతకు దూరంగా ఉంది ఫరియా. దాంతో గ్లామర్ షో చేయదేమో అనే టాక్ కూడా వచ్చింది. ఆ టాక్ తుడిపేసుకోవడానికో ఏమో.. తాజాగా ఓ ఫోటోషూట్ చేసి ఆడియన్స్ కు షాక్ ఇచ్చింది ఈ భామ. ఈ ఫోటోలు చూసిన తర్వాత దర్శక నిర్మాతలు ఎవరైనా ఈమె వైపుకు లుక్ వేస్తారేమో చూడాలిక.