తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ‘విరించి’ ఆసుపత్రిలో తమ బందువు కు సరైన చికిత్స అందించక పోవడం మూలంగా వ్యక్తి మృతికి ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం మే కారణమని మృతుని బంధువులు, స్నేహితులు కొందరు ఆసుపత్రి సిబ్బంది తో వాగ్వాదం కు దిగారు .
పంజాగుట్ట పోలీసులు విషయం తెలుసుకుని వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని వారిని వారించెందుకు యత్నించారు.అవేశంతో వుగిపోయిన మృతుని బంధువులు ఆసుపత్రి లో తీవ్రంగా గలాటా సృష్టించారు. దీంతో ఆసుపత్రిలోని కంప్యూటర్ ప్రింటర్ తో పాటు ఆసుపత్రి సామగ్రిని ధ్వంసం చేశారు.
దీంతో ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి ఘర్షణ కి కారకులైన వారిపై కేసులు నమోదు చేసి 16 మంది వ్యక్తులను మరి కొద్ది సేపట్లోనే మెజిస్ట్రేట్ ముందుకు తరలించనున్నారు.
వైద్యుల పై దాడి సరైన చర్య కాదని ,చికిత్స లో ఏదైనా లోపం కారణంగా రోగి మృతి చెందితే ,లేకపోతే ఆసుపత్రి సిబ్బంది వల్ల ఏదైనా అసౌకర్యం కలిగితే చట్టబద్దంగా తమకు పిర్యాదు చేయాలని ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి తెలిపారు. చట్టాని ఎవ్వరూ తమ చేతుల్లోకి తీసు కోవద్దని సూచించారు.