టాలీవుడ్ ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ సేవా కార్యక్రమాలతో అందరి మనసులు గెలుచుకుంటోంది. గతేడాది కరోనా సమయంలో తన వంతు సాయం చేసిన నిధి..
తాజాగా ‘డిస్ట్రిబ్యూట్ లవ్’ పేరుతో ఒక ఆర్గనైజేషన్ ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ కష్టకాలంలో ఎవరికి సాయం కావాలన్నా అడగాలని, తనకు చేతనైన సాయం చేస్తానని తెలిపింది. ఆర్గనైజేషన్ కోసం తనతో పాటు తన టీం కూడా పని చేస్తుందని నిధి పేర్కొంది.