ఏపీ కరోనా బులెటిన్ ను ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసింది.ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 91,120 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 18,285 పాజిటివ్ కేసులు వచ్చాయి.
99 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 16,27,390కి చేరింది. కరోనాతో ఇప్పటివరకు 10,427 మంది మృతి చెందారు.
14,24,859 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,92,104 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవాల్టి వరకు రాష్ట్రంలో 1,88,40,321 సాంపిల్స్న టెస్ట్ చేశారు.