దేశంలో మొత్తం బ్లాక్ ఫంగస్ కేసుల్లో 65% ఐదు రాష్ట్రాల్లో ఉన్నాయని కేంద్రం తెలిపింది. గుజరాత్లో 2,859, మహారాష్ట్రలో 2,770, APలో 768, మధ్యప్రదేశ్లో 752, తెలంగాణలో 744 కేసులు ఇప్పటివరకు నమోదైనట్లు పేర్కొంది.
ఈ చికిత్సకు ఉపయోగించే యాంపోటెరిసిన్-B ఇంజక్షన్లను ఆయా రాష్ట్రాలకు అదనంగా సరఫరా చేస్తున్నట్లు కేంద్రమంత్రి సదానందగౌడ తెలిపారు.
APకి ఇప్పటివరకు 1930, తెలంగాణకు 1890 వయల్స్ ను కేంద్రం అందించింది.