సీబీఐ కొత్త చీఫ్ గా సుబోధ్ జైస్వాల్ ను నియమించింది కేంద్ర సర్కారు. ఆయన గురించి తెలియని విషయాలు మీకోసం..
1962లో జన్మించిన సుబోధ్ జైస్వాల్ ముంబై యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్లో పనిచేశారు. రూ.20 వేల కోట్ల స్టాంపు పేపర్ల కుంభకోణం కేసును దర్యాప్తు చేశారు. 2006 ముంబై రైలు బాంబు పేలుళ్ల సమయంలో సీపీగా ఉన్నారు.
మహారాష్ట్ర డీజీపీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరోలో సేవలందించారు. రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్లో 9 ఏళ్ల పాటు పని చేశారు. 2001లో రాష్ట్రపతి పోలీసు మెడల్ అందుకున్నారు.