తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ తాను భేటీ అయ్యానన్న వార్తలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.
‘ఇప్పటివరకు ఈటల నన్ను కలవలేదు. నన్ను కలిసేందుకు సంప్రదించిన మాట వాస్తవమే. ఈటల, నేను 15 ఏళ్లు కలిసి పనిచేశాం. కలిస్తే తప్పేంటి? కలిసినంత మాత్రాన పార్టీలో చేరేందుకు అనుకోలేం.
ఎప్పుడు కలుస్తున్నామన్నది ఇంకా నిర్ణయించుకోలేదు. పార్టీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం’ అని కిషన్ రెడ్డి అన్నారు.