తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 3,821 కరోనా కేసులు వెలుగుచూశాయి. మరో 23 మంది మరణించారు. ఫలితంగా కరోనా కేసుల సంఖ్య 5,60,141కు పెరిగింది.
ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా ధాటికి 3,169 మంది మరణించారు. కొత్తగా 4,298 మంది కోలుకోగా, రికవరీల సంఖ్య 5,18,266కు చేరింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 38,706 యాక్టివ్ కేసులున్నాయి. తాజా కేసుల్లో GHMCలో 537 నమోదయ్యాయి.