తెలంగాణలో కరోనా థర్డ్ వేవు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. కరోనాపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి కేసీఆర్.
ప్రజల ఆరోగ్యం కోసమే లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నామన్నారు. రెండో డోసుకు సరిపడా టీకాలను సమకూర్చుకోవాలని అధికారులకు చెప్పారు.
బ్లాక్ ఫంగస్కు అవసరమైన మందులు సమకూర్చుకోవాలన్నారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు గాంధీలో 150, ENTలో 250 బెడ్లు ఉన్నట్లు తెలిపారు.