కరోనా బాధితుల పాలిట ఆపద్బాంధవుడు సోనూ సూద్ ఓ ఇంటర్వ్యూలో కంటతడిపెట్టాడు. ప్రస్తుత పరిస్థితుల్లో తన తల్లిదండ్రులు బ్రతికుండి బెడ్లు, ఆక్సిజన్ కోసం పోరాడుతుంటే తాను తట్టుకోలేకపోయేవాడినని భావోద్వేగానికి గురయ్యాడు.
కాగా సోనూ తండ్రి శక్తి సాగర్ సూద్ పంజాబ్లో వ్యాపారం చేసేవారు. ఆకలితో ఉన్నవారికి సోనూతో కలిసి సాయం చేసేవారు.
ఇక సోనూ తల్లి సరోజ్ పేదలకు ఉచితంగా చదువు చెప్పేవారు. అనారోగ్యంతో కొంతకాలం క్రితం వారు కన్నుమూశారు.