తెలంగాణ రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ లను ప్రభుత్వం నియమించింది. సీఎం శ్రీ కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీలు, యుజిసి నిబంధనలకు అనుగుణంగా, రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ ల నియామక ప్రక్రియను చేపట్టి పేర్లను సూచించింది. కరోనా నేపథ్యంలో కొంత ఆలస్యం జరిగినా, నిబంధనల ప్రకారం అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి చేసి గవర్నర్ ఆమోదం కోసం సిఫారసు చేయడం జరిగింది. ఇవాళ రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజాన్ వీసీల నియామకానికి ఆమోదం తెలిపారు.
ఉస్మానియా యూనివర్సిటీ, (హైదరాబాద్) వీసీ గా ప్రొ. డి. రవీందర్ యాదవ్ (బీసీ)., కాకతీయ యూనివర్సిటీ (వరంగల్) వీసీ గా ప్రో. టి. రమేష్ (బీసీ)., తెలంగాణ యూనివర్సిటీ, (నిజామాబాద్) వీసీ గా ప్రో. డి. రవీందర్ (ఓసి). డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ (హైదరాబాద్) వీసీ గా ప్రొ. సీతారామారావు (ఓసి)., పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ (హైదరాబాద్) వీసీ గా ప్రొ. టి. కిషన్ రావు (ఓసి).,
పాలమూరు యూనివర్సిటీ (మహబూబ్ నగర్) వీసీ గా ప్రొ. లక్ష్మీకాంత్ రాథోడ్ (ఎస్టీ). మహాత్మాగాంధీ యూనివర్సిటీ, (నల్లగొండ) వీసీ గా ప్రో. సిహెచ్. గోపాల్ రెడ్డి,. జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ (హైదరాబాద్) వీసీ గా ప్రొ. కట్టా నర్సింహా రెడ్డి (ఓసి), శాతవాహన యూనివర్సిటీ, (కరీంనగర్) వీసీ గా ప్రో. మల్లేశం (ఎస్సీ). జవహర్ లాల్ నెహ్రు ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (హైదరాబాద్) వీసీగా శ్రీమతి కవిత దర్యాని (ఓసి)., లను గవర్నర్ ఆమోదం మేరకు రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.