తనకు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ కాల్స్, సోషల్ మీడియా ద్వారా అభ్యంతరకర సందేశాలు పంపిస్తూ వేధిస్తున్నారంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సింగర్ మధుప్రియ ఫిర్యాదు చేసింది.
రెండు రోజులుగా బ్లాంక్ ఫోన్ కాల్స్ వస్తున్నాయని, దీంతో మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొంది.
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. దీనిపై పోలీసులు దర్యాపు చేపట్టారు.