తెలంగాణ వ్యాప్తంగా కరోనా కట్టడి కోసం ప్రభుత్వం లాక్ డౌన్ విధించగా.. ఆంక్షలు అమల్లో ఉండే ఉ.10 గంటల తర్వాత కూడా ప్రజలు బయటకు వస్తున్నట్లు DGP మహేందర్ రెడ్డి తెలిపారు.
‘ఏ అవసరం ఉన్నా ఉ.6 నుంచి 10 గంటల మధ్యనే బయటకు రావాలి. ఈ 4 గంటల సమయంలోనే ఈ-కామర్స్ సేవలకు అనుమతి ఇస్తాం.
లాక్ డౌన్ సమయంలో బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. వాహనాలను సీజ్ చేస్తాం. సీజ్ చేసిన వాహనాలను లాక్డ్ డౌన్ తర్వాతే అప్పగిస్తాం’ అని DGP చెప్పారు.