ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. ‘అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలన్నది మా నిర్ణయం. వ్యాక్సిన్ల కొరతతో 45 ఏళ్లు పైబడిన వారికే ఇస్తున్నాం.
ప్రైవేట్ ఆస్పత్రులకు నేరుగా వ్యాక్సిన్ ఇవ్వడం సరికాదు. వాళ్లు ఇష్టారాజ్యంగా వ్యాక్సిన్ ధరను నిర్ణయిస్తున్నారు. దీని వల్ల సామాన్య ప్రజల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతోంది.
18-44 ఏళ్ల వారికి వ్యాక్సిన్ చేరాలంటే నెలలు పట్టేలా ఉంది’ అని జగన్ లేఖలో పేర్కొన్నారు