వైసీపీ రెబల్ ఎంపీ “రఘురామరాజు ఎలాంటి ప్రెస్ మీట్ లు పెట్టకూడదు. మీడియాకు, సోషల్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు. ప్రభుత్వం పిలిచినప్పుడు విచారణకు హాజరు కావాలి” అని కండిషన్ బెయిల్ ఇచ్చిన సుప్రీం కోర్ట్.
సీఐడీ విచారణకు రఘురామ పూర్తిగా సహకరించాలని, విచారణ అధికారి ఎప్పుడు పిలిచినా హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.విచారణకు అధికారి 24 గంటల ముందు నోటీసులివ్వాలని సూచన.న్యాయవాదుల సమక్షంలోనే విచారణ జరపాలని సుప్రీంకోర్టు సూచన.
సీబీఐకి కేసు ఇవ్వాలనే రోహాత్గీ వాదనతో ఏకీభవించని సుప్రీంకోర్ట్.సీఐడీ సుమోటోగా వేసిన కేసును కొట్టేయలేమన్న సుప్రీం కోర్ట్.రఘురామరాజు నిబంధనలు ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని సుప్రీం కోర్ట్ హెచ్చరించింది.