Home / SLIDER / తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల

తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల

తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి విద్యార్థులు సాధించిన గ్రేడ్లను ప్రకటించారు.

ఈ ఏడాది 2,10,647 మంది 10కి పది గ్రేడ్‌ పాయింట్లు సాధించారు. రెగ్యులర్‌ సహా గతంలో ఫెయిల్‌ అయిన విద్యార్థులు మొత్తం 5,21,073 మంది పాసయ్యారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో పరీక్షలు నిర్వహించే అవకాశం లేకపోవటంతో ఈ ఏడాది ఎస్సెస్సీ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే.

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాలతో అందర్నీ పాస్‌ చేసిన అధికారులు ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఏ)-1 మార్కుల ఆధారంగా గ్రేడ్లు రూపొందించారు. గ్రేడ్ల వివరాలను www.bse. telangana.gov. in, results.bsetelangana.org నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని మంత్రి సబిత పేర్కొన్నారు. ఈ ఏడాది హాల్‌టికెట్లు జారీ చేయకముందే పరీక్షలు రద్దయ్యాయి. మెమోలపై మాత్రం హాల్‌టికెట్‌ నంబర్లు ముద్రించనున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat