కొవిడ్ మందుల పేర్లు పలికేందుకు కష్టంగా ఉన్నాయని, వీటికి పేర్లు పెట్టడంలో కాంగ్రెస్ నేత శశిథరూర్ హస్తం ఉందా అని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ పై కాంగ్రెస్ నేత శశిథరూర్ స్పందించారు.
వాటిని కొరోనిల్, కొరొజీరో, గోకరోనాగో అని పిలవడానికి అభ్యంతరం లేదని, భారీ ఇంగ్లీష్ పదాలతో ట్వీట్ చేశారు. ఆంగ్లంలో పాండిత్యం అధికంగా ఉన్న నేతగా శశిథరూర్‌కు పేరుంది.
ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ థరూర్‌పై జోక్ చేయగా, ఆయన భారీ పదాలతో బదులిచ్చారు.