ఏపీ అధికార వైసీపీకి చెందిన రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఇరువైపుల వాదనలు విన్న తర్వాత ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు.. విచారణకు 24 గంటల ముందే సీఐడీ నోటీసులివ్వాలని పేర్కొంది. న్యాయవాది సమక్షంలోనే విచారించాలని సూచించింది.
విచారణకు సహకరించాలని రఘురామను ఆదేశించింది. రఘురామ సోషల్ మీడియా, మీడియా ముందుకు రాకూడదని, ఎలాంటి ప్రెస్మీట్లు పెట్టరాదని తెలిపింది.