సినీ నటి రేణు దేశాయ్ సీరియస్ అయ్యారు. కొవిడ్-19 చికిత్స కోసం సాయం కోరుతూ తాము పంపే సందేశాలకు సరైన సమయంలో స్పందించడం లేదని కొందరు వ్యక్తులు మెస్సేజ్‌లు రేణూదేశాయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ వేళ ఇంట్లోనే ఉంటున్న రేణూ దేశాయ్.. కొన్నిరోజులుగా కొవిడ్ బాధితులకు చేయూతనందిస్తున్నారు.
కొవిడ్ దావాఖానల విషయంలో సాయం చేయమని కోరుతూ రేణూకి తాజాగా ఓ నెటిజన్ మెస్సేజ్ చేశాడు. అయితే, దానికి ఆమె స్పందించలేదు. దీంతో సదరు నెటిజన్ ఆగ్రహానికి గురయ్యాడు.
‘మేడం సాయం చేస్తున్నా’ అన్నారు. మీరు ఎక్కడ చేస్తున్నారండి సాయం. డబ్బు ఉన్న వాళ్లనే మీరు పట్టించుకుంటారు కానీ మాలాంటి మధ్య తరగతి వాళ్లని పట్టించుకోరు’ అని మరో మెసేజ్ పెట్టాడు.
ఆ నెటిజన్ పంపిన సందేశం పట్ల రేణు దేశాయ్ అసంతృప్తి చెందారు. తనని ప్రశ్నించాల్సిన అవసరం ఎవరికీ లేదని.. కావాలంటే రాజకీయ నాయకుల్ని ప్రశ్నించమని ఆమె అన్నారు.
‘సుమారు 10-12 రోజులుగా కరోనా బాధితులకు చేతనైన మేరకు సాయం చేస్తున్నా. మీరు నన్ను ప్రశ్నించడానికి నేనేమీ రాజకీయ నాయకురాలిని కాదు.. మీరు ఎన్నుకున్న నేతను కాదు.. మీరు ఓట్లేసి ఎన్నుకున్న వారి వద్దకు వెళ్లి వాళ్లని ప్రశ్నించండి!!’ అని ఘాటుగా రిప్లయ్ ఇచ్చారు.
సాయం కోరుతూ కొంతమంది వ్యక్తులు పెడసరి ధోరణితో నాకు మెస్సేజ్‌లు పెడుతున్నారని ఆమె పేర్కొన్నారు. వాటి వల్ల కొన్నిసార్లు సాయం చేయాలనే స్ఫూర్తి పోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
‘ఒకవేళ నేను కనుక మీ మెస్సేజ్‌కు స్పందించకపోతే దయచేసి నాకు మరొ సందేశం పంపండి. చేయూత ఇవ్వమంటూ నాకు ఎంతోమంది సందేశాలు పంపడంతో కొన్నింటిని నేను చూడలేకపోతున్నాను’ అని రేణూ వెల్లడించారు.