కరోనా వైరస్ సృష్టిస్తున్న రెండో దశ విధ్వంసంలో రాష్ట్ర పోలీసులు సమర్థంగా పనిచేస్తున్నారని మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు ప్రశంసించారు.
అత్యంత విలువైన ఔషధాలు, ఆక్సిజన్ సిలిండర్లు బ్లాక్‌మార్కెట్‌కు తరలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని కితాబిచ్చారు. బ్లాక్‌మార్కెటింగ్‌కు పాల్పడుతున్న వారిపై 128 కేసులు నమోదుచేసి 258 మందిని అరెస్ట్‌చేయడంపై సంతృప్తి వ్యక్తంచేశారు.
కరోనా ఔషధాల బ్లాక్‌మార్కెటింగ్‌పై ఎవరికైనా సమాచారముంటే 100 ఫోన్ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని, @telanganadgpకి ట్వీట్ చేయాలని ప్రజలకు సూచించారు.