తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. కరోనా సెకండ్‌వేవ్ తీవ్రతను తగ్గించేందుకు రాష్ట్రప్రభుత్వం ఈ నెల 12 నుంచి లాక్‌డౌన్‌ను అమలుచేస్తున్న విషయం తెలిసిందే.
ఈ నెల 11న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం 12 నుంచి 10 రోజులపాటు లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకున్న విష యం తెలిసిందే. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి గురువారం ఉత్తర్వులు జారీచేశారు.
కరోనా నియంత్రణ కోసం కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, పోలీస్ సూపరింటెండెంట్లు లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలుచేయాలని సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రజలెవ్వరూ బయటకు రాకుండా చూడాలని సూచించారు. సడలింపులు ఇచ్చిన ఉదయం 6 నుంచి ఉదయం10 గంటల సమయంలోనూ అవసరం ఉంటేనే బయటకు ప్రజలకు విజ్ఞప్తిచేశారు.