యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న విష్ణుప్రియ.. ఆ తర్వాత ‘పోవే పోరా’ అనే టీవీ షోతో యాంకర్‌గా తన సత్తా నిరూపించుకుంది. దీంతో పాటు పలు సినిమాల్లో కూడా ఆమె నటించింది.
ప్రస్తుతం ‘చెక్‌మేట్’ అనే సినిమాలో విష్ణుప్రియ నటస్తోంది. ఈ సినిమా కరోనా వలన వాయిదా పడింది. అయితే టీవీ, సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా రచ్చ చేస్తూనే ఉంటుంది.
ఇటీవల నీలి రంగు చీరలో తన వొంపుసొంపులను ఆరబోస్తూ.. ఓ ఫోటోషూట్ నిర్వహించింది. ఇది చూసిన నెటిజన్స్ విష్ణు ప్రియపై నెగెటివ్ కామెంట్స్ చేశారు.
దీనిపై స్పందించిన విష్ణు ప్రియ ఇది నా వృత్తి , దాని పరంగా రకరకాల దుస్తులు ధరించాల్సి వస్తుంది అని పేర్కొంది. తాజాగా షార్ట్ డ్రెస్‌లో అందరి మతులు పోగొడుతూ ఓ ఫొటో షూట్ చేసింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.