కరోనా మహమ్మారికి మరో రాజకీయ ప్రముఖుడు బలయ్యారు. ఉత్తరప్రదేశ్ మంత్రి విజయ్ కశ్యప్ కరోనాతో కన్నుమూశారు. 56 ఏండ్ల కశ్యప్ కరోనా బారినపడటంతో గుర్గావ్‌లోని వేదాంత దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
అయితే పరిస్థితి విషమించడటంతో ఆయన మంగళవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. మంత్రి ముజఫర్‌నగర్‌లోని ఛర్తవాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాగా, సీఎం యోగీ ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో ఇప్పటికే ఇద్దరు మంత్రులు కరోనా వల్ల మరణించారు. కశ్యప్ మృతితో ఆ సంఖ్యగా మూడుకు చేరింది.
అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు మృతిచెందారు. మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే బహదూర్ కొరి ఈ నెల 7వ తేదీన కరోనా కారణంగా కన్నుమూశారు.
అంతకుముందు నవాబ్ జంగ్ నియోజకవర్గ ఎమ్మెల్యే కేసర్ సింగ్ గంగ్వార్, ఏప్రిల్ 23న లక్నో పశ్చిమ ఎమ్మెల్యే సురేశ్ కుమార్ శ్రీ వాస్తవ, ఏప్రిల్ 22న అరారియా ఎమ్మెల్యే రమేశ్ చంద్ర దివాకర్ కూడా కోవిడ్ వల్ల మరణించారు.