ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్, హీరో రామ్ ఇంట విషాదం చోటు చేసుకుంది. రవికిశోర్ తండ్రి, రామ్ తాతయ్య పోతినేని సుబ్బారావు అనారోగ్య సమస్యలతో మంగళవారం (ఈ రోజు) ఉదయం విజయవాడలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. తాతయ్య మరణంతో రామ్ భావోద్వేగానికి లోనయ్యారు.
‘విజయవాడలో లారీ డ్రైవర్‌గా ప్రారంభమైన మీ జీవితం మాకెన్నో పాఠాలను నేర్పించింది. కుటుంబ సభ్యుల కోసం చాలా కష్టపడ్డారు. మన దగ్గర ఉన్న డబ్బుని బట్టి కాదు, మంచి మనస్సు వల్ల ధనవంతులవుతారని మాకు నేర్పించారు. మీ వల్లనే ఈ రోజు మీ పిల్లలం అందరం మంచి స్థానంలో ఉన్నాం. మీ మరణ వార్త నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను అంటూ రామ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.