మే 20న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన పుట్టిన రోజుకు అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు జరపాలనుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
దాంతో స్వయంగా ఎన్.టి.ఆర్ ట్విట్టర్ వేదిక ద్వారా తన విన్నపాన్ని తెలియజేశారు. ఇటీవల ఆయనకు కరోనా సోకడంతో హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు.
అభిమానులు..సినీ ప్రముఖులు తారక్ త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తున్నారు. కొందరు అభిమానులు ప్రార్ధనలు చేస్తున్నారు. ఇవన్నీ తాను చూస్తున్నాని ..మీరు నాపట్ల చూపిస్తున్న ప్రేమకు..ఆప్యాయతకు ఏమిచ్చి రుణం తీర్చుకోను అంటూ లేఖలో పేర్కొన్నారు