తెలంగాణలో ఇంజనీరింగ్‌తో పాటు అగ్రికల్చర్, వెటర్నరీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఎంసెట్ పరీక్ష దరఖాస్తు గడువును ఈనెల 26వరకు పొడిగించారు. ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లించేందుకు ఈనెల 18 వరకు గడువు ఉండగా.. దీనిని పొడిగిస్తూ పరీక్ష నిర్వహణ సంస్థ జేఎన్‌టీయూ నిర్ణయం తీసుకుంది.
ఈ గడువులోపు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ఎంసెట్ కన్వీనర్, జేఎన్‌టీయూ రెక్టార్ ఆచార్య గోవర్ధన్ తెలిపారు. కాగా, సోమవారం సాయంత్రం వరకు మొత్తం 1,56,526 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు.
ఇందులో ఇంజనీరింగ్ 1,06,506, మెడికల్ 50,020 దరఖాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. అగ్రికల్చర్, మెడికల్ విద్యార్థులకు జూలై 5, 6న మూడు విడతల్లో, ఇంజనీరింగ్ విద్యార్థులకు జూలై 7, 8, 9 తేదీల్లో ఐదు విడతల్లో ఎంసెట్ పరీక్ష నిర్వహించనున్నారు.