తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజువారీ పాజిటివ్ కేసులు మూడు వేలకు పైనే నమోదవుతున్నాయి. మరో 27 కోవిడ్-19 మరణాలు సంభవించాయి.
అదే సమయంలో 5,186 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 48,110 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. తెలంగాణలో గడిచిన 24గంటల వ్యవధిలో 71,616 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
జిహెచ్ఎంసి పరిధిలో కొత్తగా 607, రంగారెడ్డి 262, ఖమ్మం 247, మేడ్చల్ 225 కరోనా కేసులు రికార్డయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తాజాగా విడుదలైన హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు.