ఈటెల ను నమ్ముకున్న వాళ్ళ …
రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరమే !!
రాజకీయంగా ముందు చూపు లేని వాళ్ళే
అలాంటి వాళ్ళ వెంట వెళతారు
అసలు కేసీఆర్ కు దూరం కావడమే
ఈటెల దురదృష్టం అంటున్న రాజకీయ విశ్లేషకులు
కనీసం మరో పదేళ్ళపాటు టి ఆర్ ఎస్ కు తిరుగులేదనే అభిప్రాయంతో ఏకీభవిస్తున్న మెజార్టీ తెలంగాణ ప్రజలు
కాంగ్రెస్ , బీజేపీ కానీ కొత్త పార్టీలు కానీ టి ఆర్ ఎస్ కు ప్రత్యామ్నాయంగా మారే పరిస్థితులే తెలంగాణలో లేవంటున్న మేధావులు
2001 నుండి ఇప్పటి వరకు కేసీఆర్ ను విడిచిపెట్టిన ఏ ఒక్క నాయకుడు కూడా సక్సెస్ కాలేదు. ఈ ఒక్క మాట చాలు తెలంగాణ రాజకీయాలు కేసీఆర్ చుట్టూ ఎంత బలంగా వేళ్ళూనుకున్నాయో చెప్పడానికి . టి ఆర్ ఎస్ పార్టీలో ఇప్పుడు ఒక వెలుగు వెలుగుతున్న ఏ స్థాయి నాయకుడికైనా ఆ ప్రభ కేసీఆర్ వెన్నంటి ఉన్నంత వరకే . ఎందుకంటే తెలంగాణ అంటేనే కేసీఆర్ అని నాలుగు కోట్ల మంది ఎంతో బలంగా విశ్వసిస్తున్నారు కాబట్టి . ఈటెల రాజేందర్ లాంటి వ్యక్తికి టి ఆర్ ఎస్ లో ఉన్నంత వరకే విలువ. ఆ గేటు దాటి బయటికి వచ్చిన మరు క్షణమే ఆయన వ్యాలిడిటీ ముగిసింది. మాజీ మంత్రి కాబట్టి …తెలంగాణ వ్యతిరేక మీడియా కొన్ని రోజుల పాటు ఓ పది లైన్ల వార్తలను ప్రచురిస్తుంది . వాటిని చూసి ఆయన తనను తాను ఎక్కువ ఊహించుకోవచ్చు. కేసీఆర్ కు దూరమైన మొట్ట మొదటి టి ఆర్ ఎస్ శాసనసభా పక్ష నేత విజయరామారావును తెలంగాణ ప్రజలు మర్చిపోయి చాలా రోజులైంది. అలాగే కేసీఆర్ గారి వెంట ఉండి ఒక వెలుగు వెలిగిన చాలా మంది నేతలను తెలంగాణ సమాజం పట్టించుకోవడం లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజల కష్టాల గురించి … వాళ్ళ అవసరాల గురించి తెలిసిన నాయకుడు … వాటిని పరిష్కరిస్తూ ఓ కుటుంబ పెద్దలా ఆదుకుంటున్న నాయకుడు కేసీయారే కాబట్టి . పరిస్థితులను బట్టి ప్రజల మేలు కోసం ఎలాంటి నిర్ణయమైనా తక్షణమే తీసుకునే సామర్ధ్యం ఒక్క కేసీఆర్ గారికి మాత్రమే సాధ్యం. కేసీఆర్ గారి స్టామీనా తెలిసిన వాళ్ళు ఎవరైనా … కనీసం ఇంకో 20 ఏళ్ళు తెలంగాణకు ఎలాంటి ఆపద రాకుండా ఆయన కాపాడుకో గలుగుతారని నమ్ముతారు. తెలంగాణ వస్తుందో రాదో తెలియనప్పుడే ఒక దళితునికి మొట్ట మొదటి పార్టీ శాసన సభా పక్ష పదవి ఇచ్చి , తర్వాత రెండో దఫాలో ఒక బీసీ బిడ్డను గౌరవిద్దామని అదే పదవిని ఈటెల రాజేందర్ కు ఇచ్చి ఆయనను అక్కున చేర్చుకున్నారు కేసీఆర్ . అదే సమయంలో ఈటెల లాంటి వాళ్ళు కేసీఆర్ గారి వెంట ఎంతో మంది కలిసి వచ్చారు. తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసి … తన ప్రాణాలకు తెగించి … ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి ప్రజల ఆశీస్సులతో రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పర్చిన కేసీఆర్ గారి వెంట ఉండడం అనే అదృష్టం అందరికీ దక్కదు. ఆయన మంత్రి వర్గంలో రెండు సార్లు మంత్రి పదవి పొందిన ఈటెల రాజేందర్ దాన్ని నిలుపుకోలేక పోయిండు. కేసీఆర్ లాంటి ఒక అత్యున్నత నాయకుడి ప్రభుత్వంలో మంత్రి పదవికి మించిన పెద్ద పదవి ఇంకేమీ లేదు. ఏ పార్టీ అయినా , ఏ ప్రభుత్వమైనా … భిన్నాభిప్రాయాలు ఉన్నా అంతిమంగా ఒకరి మాట మీద నడవాల్సి ఉంటుంది. తెలంగాణ గురించి సమగ్ర సంపూర్ణ అవగాహన ఉన్న నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సమయంలో పార్టీకి , ప్రభుత్వానికి నచ్చని విధంగా ప్రవర్తించడం ఈటెల రాజేందర్ చేసిన పెద్ద తప్పు. కన్న తల్లి లాంటి పార్టీకి ద్రోహం తలపెట్టేందుకు అర్ధరాత్రి చాలా సార్లు గన్ మెన్లను తప్పించుకొని రహస్యంగా తెలంగాణ ద్రోహులను కలిసి చర్చలు జరపడం ఆయన చేసిన ఘోర తప్పిదం. ఆర్ధికంగా కొన్ని వందల కోట్ల సంపద ఉన్న ఈటెల తన పౌల్ట్రీ బిజినెస్ కోసం పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని కూడా గుంజుకోవడం ఇంకా క్షమించరాని నేరం. తన వ్యాపారాల కోసం తను చేసే అడ్డమైన పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించలేదు. దీంతో పార్టీకి , ప్రభుత్వానికి వ్యతిరేకంగా అడ్డగోలుగా మాట్లాడి తిక్క వేషాలు వేయడం , బడుగుల అసైన్డ్ భూములు కొనుగోలు చేయడం ముఖ్యమంత్రికి ఆగ్రహాన్ని తెప్పించింది. తెలంగాణ ప్రభుత్వానికి , పార్టీకి , ప్రజలకు నష్టం చేస్తే ఎంతటి వాళ్ళనైనా క్షమించని ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి ఈటెల రాజేందర్ అక్రమాల మీద విచారణ జరిపి ఆయనను మంత్రి వర్గం నుండి బర్తరఫ్ చేయాల్సి వచ్చింది. ఇక తన ఆటలు టి ఆర్ ఎస్ లో కొనసాగలేదని భావించిన ఈటెల రాజేందర్ ఇప్పుడు కొత్తగా బడుగుల పేరు జెప్పి కొత్త నాటకానికి తెర లేపుతున్నడు. అసలు మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవ్వడూ ఈటెల వెంట వెళ్లరని కొందరు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నరు . ఎందుకు అని అడిగితే … వాళ్ళు చెప్పే సమాధానం ఆలోచనలో పడేస్తున్నది . “తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ , అభివృద్ధి ఫలాలను ప్రజలు అందుకుంటున్నరు. విద్యుత్తు , సాగు నీటి ప్రాజెక్టులు పూర్తవుతున్నయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్భాన్ని బట్టి ప్రజల అభీష్టానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నరు. దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో కేసీఆర్ పాలన మీద ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నరు. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ కు ఎదురు నిలబడి ఢీ కొనే పరిస్థితి కాంగ్రెస్ , బీజేపీ లకే కాదు ఎవరికీ లేదు. కేసీఆర్ వ్యతిరేకులు తెలంగాణ ప్రజలకు మేలు చేసే అంశాల గురించి కాకుండా కేసీఆర్ ను విమర్శిస్తేనే ఉనికి ఉంటుందని అనుకుంటున్నరు . అక్కడే వాళ్ళు తప్పటడుగులు వేస్తున్నరు. ఈటెల రాజేందర్ కూడా కేసీఆర్ వ్యతిరేక గుంపులో గోవిందం లాగా మారుతున్నడు. రాజేందర్ వెంట వెళ్లాలనుకునే వాళ్ళు రాజకీయంగా ఎటూ కాకుండా పోయే ప్రమాదం ఉంది ” అని ఒక సీనియర్ రాజకీయ విశ్లేషకుడు వ్యాఖ్యానించడం గమనార్హం. ఈటెల రాజేందర్ కు టి ఆర్ ఎస్ లో కొనసాగడం ఇష్టం లేకుంటే బయటికి వచ్చి తటస్థంగా ఉంటే సరిపోయేదని కానీ కేసీఆర్ వ్యతిరేక వైఖరి తీసుకుని గతంలో కొందరి మాదిరిగా అతను కూడా విఫల రాజకీయ నాయకుడిగా మిగిలి పోక తప్పదని మరో విశ్లేషకుడు వ్యాఖ్యానించారు. కాకపోతే కేసీఆర్ వ్యతిరేకుల మాటలు నమ్మి ఈటెల తను మునగడంతో పాటు తన వెంట వచ్చే ఒకరిద్దరిని కూడా ముంచడం ఖాయమని ఇది తటస్థంగా ఆలోచించగలిగితేనే అర్ధమవుతుందని పేర్కొన్నారు. సింపుల్ గా చెప్పాలంటే హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటెల ఓడిపోయే వరకు మీడియా కొన్ని రోజులు ఆయన గురించి ప్రస్తావిస్తుందని ఆ తర్వాత ఇంకేమీ ఉండదని ఆ విశ్లేషకుడు ప్రస్తావించడం గమనార్హం .