Home / SLIDER / ప్రైవేట్‌ ఫీజులపై పర్యవేక్షణ : మంత్రి ఎర్రబెల్లి

ప్రైవేట్‌ ఫీజులపై పర్యవేక్షణ : మంత్రి ఎర్రబెల్లి

కరోనా నియంత్రణ కోసం, వైరస్ బారిన పడిన వారి వైద్య సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎరబెల్లి దయాకర్‌రావు అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లకు అవసరమైన రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను, ఆక్సిజన్‌ను పూర్తి స్థాయిలో సరఫరా చేస్తోందని చెప్పారు. కరోనా వైద్య సేవల కోసం కొన్ని ప్రైవేటు హాస్పిటళ్లు అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయని.. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ప్రభుత్వ పరంగా సరఫరా అవుతున్న ఇంజక్షన్లు, ఆక్సిజన్‌కు అధికంగా బిల్లులు వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తామని అన్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణ… ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లలో వైద్య సేవలపై వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లా అధికారులు, ప్రైవేటు హాస్పిటళ్ల ప్రతినిధులతో మంత్రి ఎరబెల్లి వరంగల్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రైవేటు హాస్పిటళ్లలో వైద్య సేవలు, బిల్లుల వసూళ్లపై పర్యవేక్షణ కోసం జిల్లా అధికారులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు.

జిల్లా వైద్యాధికారి, ఆర్డీవో, డిప్యూటీ పోలీస్ కమిషనర్‌, డ్రగ్‌ ఇన్స్​‍పెక్టర్‌, జిల్లా పంచాయతీ అధికారి కమిటీలో ఉంటారని తెలిపారు. అధిక బిల్లులతోపాటు ప్రైవేటు హాస్పిటళ్లలోని పేషెంట్లకు అవసరమైన రెమిడిసివియర్‌ ఇంజక్షన్లు, ఆక్సిజన్‌ సరఫరాలో ఇబ్బందులు రాకుండా ఈ కమిటీ సమీక్షిస్తుందని చెప్పారు.

జిల్లా కలెక్టర్‌, వరంగల్‌ పోలీస్ కమిషనర్‌ ఆధ్వర్యంలో కమిటీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుందని అన్నారు. సిటీ స్కాన్‌ సేవల కోసం ఇప్పుడు ఇష్టం వచ్చిన రీతిలో వసూలు చేస్తున్నారని… రూ.2 వేలకు ఈ సేవలను అందించేలా ప్రైవేటు సంస్థలు అంగీకరించాయని మంత్రి ఎరబెల్లి తెలిపారు.

కరోనా బాధితులకు ఎంజీఎంలో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని చెప్పారు. లక్షణాలు ఉన్న వారు కరోనా పరీక్ష అవసరం లేకుండానే మందులు వాడేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. జర్వరం సర్వే, లాక్‌డౌన్‌తో మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎంజీఎం దవాఖానను సందర్శించడం బాగుందని, అక్కడి వైద్య సేవలపై హాస్పిటల్‌లో ఉన్న వారితో మాట్లాడితే బాగుండేదని అన్నారు.

బండి సంజయ్‌ మరోసారి వరంగల్‌కు వచ్చినప్పుడు కోచ్‌ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ స్థలాలను…. టెక్స్​​‍టైల్‌ పార్కును సందర్శించాలని కోరారు. అప్పుడైనా కేంద్రంతో మాట్లాడి తెలంగాణకు న్యాయం జరిగేలా చూస్తాడని ఆశిస్తున్నామని ఎద్దేవా చేశారు.
కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయభాస్కర్‌, గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి, ఎంపీలు బండా ప్రకాశ్‌, పసునూరి దయాకర్‌, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్‌, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.

కాగా, కాకతీయ మెడికల్‌ కాలేజీ పూర్వ విద్యార్ధులు రూ.5 లక్షల విలువైన ఆక్సిజన్‌ కాన్సంట్రేషన్‌ మిషన్లు, బైప్యాక్‌ మిషన్లను మంత్రి ఎరబెల్లికి అందజేశారు. ఎంజీఎంతోపాటు ఉమ్మడి జిల్లాలోని వివిధ హాస్పిటళ్లకు వీటిని అందించారు ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat