Home / LIFE STYLE / COVID లక్షణాలు -నిర్ధారణ – విశ్లేషణ

COVID లక్షణాలు -నిర్ధారణ – విశ్లేషణ

COVID లక్షణాలు | నిర్ధారణ | విశ్లేషణ |

■ జ్వరం, దగ్గుతో ఉన్న ఓ వ్యక్తి(40) కరోనా నిర్ధారణ కోసం *ఆర్ టీ-పీసీఆర్* (రివర్స్ ట్రాన్స్ క్రిప్షన్ పొలిమెరేజ్ చైన్ రియాక్షన్ ) పరీక్ష చేయించుకోగా ఫలితాల్లో నెగెటివ్ వచ్చింది.

> లక్షణాలు అలాగే ఉండడంతో వైద్యుని సలహా మేరకు కొవిడ్ చికిత్సనే ఇంటి వద్ద పొందాడు.
> 10 రోజులు గడిచినా లక్షణాలు తగ్గకపోగా, మరింతగా పెరిగాయి. ఆయాసం ఎక్కువైంది.
> సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో యాంటీజెన్ పరీక్ష చేయించుకున్నాడు. అందులోనూ నెగెటివ్ వచ్చింది.
> రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గిపోతుండటంతో… ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో చేరాడు. అక్కడ కూడా *ఆర్ టీ-పీసీఆర్* పరీక్ష చేయగా కొవిడ్ లేదు.
> ఈ పరిస్థితుల్లో ఛాతీ *CT* *స్కాన్* తీయించిన వైద్యులు.. కొవిడ్ గా నిర్ధారించి, చికిత్స అందిస్తున్నారు.
> పరీక్షలు చేస్తే వెల్లడైన ఫలితాలనే ఎవరైనా నమ్ముతారు. వైరస్ ఉంటే ఉన్నట్లు.. లేకపోతే లేనట్లుగా భావిస్తారు.
> కరోనాగా నిర్ధారిస్తే.. దానికి తగ్గట్లుగా చికిత్స పొందుతూ మానసికంగా సన్నద్ధమవుతారు. లేదని తేలితే.. వైరస్ సోకలేదని ఊరట పొందుతారు.
> అయినా లక్షణాలు కనిపిస్తుంటే.. సీజనల్ వ్యాధులు కావచ్చులే అని అనుకునే అవకాశాలూ ఉన్నాయి.
> అయితే రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితి విషమించి, చివరకు ‘ *CT* *స్కాన్* ’ ద్వారా కొందరిలో కొవిడ్ ను నిర్ధారించాల్సి వస్తోంది.
> ప్రస్తుతం ఈ తరహాలో కరోనా నిర్ధారణ అవుతున్నవారు కూడా గుర్తింపు సంఖ్యలోనే వెలుగులోకి వస్తున్నారు. వీరిలో ఇంకో ప్రమాదం కూడా పొంచి ఉంది.
> కొవిడ్ ను గుర్తించి, కచ్చితమైన చికిత్స అందించకపోవడం వల్ల ఈ తరహా వ్యక్తుల్లో కొన్నిసార్లు పరిస్థితి విషమించి… ఆసుపత్రుల్లో చేరాల్సి వస్తోంది.
> కరోనా నిర్ధారణ కాకపోయినా.. లక్షణాలు మాత్రం కొనసాగుతుంటే.. మరింత లోతుగా పరీక్షలు చేయించుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
> నాలుగడుగులు వేస్తే ఆయాసం వస్తున్నా… రక్తంలో ఆక్సిజన్ శాతం 94 కంటే తక్కువైనా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.

■ వైరస్ ఉందా? లేదా? తెలిసేదెలా?

> కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత క్రమేణా పెరిగిపోతుంటాయి. ఆ తర్వాత రోగ నిరోధక శక్తి సామర్థ్యా న్ని బట్టి తగ్గిపోతాయి.
> శరీరంలోకి ప్రవేశించిన వైరస్ ను యాంటీజెన్ అంటారు.
> వైరస్ ను ఎదుర్కోవడానికి మన శరీరం స్పందిస్తుంది దీన్ని యాంటీబాడీస్ అంటారు.

■ ఈ యాంటీబాడీస్ రెండు రకాలు |
1. *ఐజీఎం* (ఇమ్యునోగ్లోబులిన్స్ -ఎం)
2. *ఐజీజీ* (ఇమ్యునోగ్లోబులిన్స్ -జి)

> వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తొలి 7 రోజుల వరకూ యాంటీబాడీస్ ఉండవు.
> 7 రోజుల తర్వాత మొదట ఐజీఎం తయారవుతాయి.
> పరీక్షల్లో ఐజీఎం పాజిటివ్ ఉంటే.. తాజాగా ఇన్ ఫెక్షన్ బారినపడినట్లుగా అర్థం. ఇవి 7-21 రోజుల వరకూ శరీరంలో ఉంటాయి.
> ఆ తర్వాత ఐజీజీగా రూపాంతరం చెందుతాయి. ఐజీజీలు కూడా సాధారణంగా వైరస్ శరీరంలో ప్రవేశించిన 14వ రోజు నుంచి తయారవుతాయి.
> ఐజీజీ ఉన్నట్లుగా ఫలితాల్లో నిర్ధారిస్తే.. ఆ వ్యక్తికి వైరస్ వచ్చి వెళ్లిపోయిందని అర్థం.
> సాధారణంగా 28 రోజుల తర్వాత శరీరం నుంచి వైరస్ పూర్తిగా వెళ్లిపోయి, కేవలం ఐజీజీ యాంటీబాడీస్ మాత్రమే ఉంటాయి.
> ఒకవేళ రోగికి వైరస్ సోకిందా? లేదా? అని కచ్చితంగా తెలియాలంటే..
> ఆర్ టీ-పీసీఆర్ తో పాటు *ఐజీఎం*, *ఐజీజీ* పరీక్షలూచేయాలి.
> ఈ పరీక్షలకు సుమారు రూ.600 -1000 వరకు ఖర్చవుతుంది.
> అయితే ఇప్పటివరకు ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం వైరస్ ను తొలిదశలో గుర్తించడానికి ఆర్ టీ-పీసీఆర్ పరీక్షనే ప్రామాణికం.
> సీటీస్కాన్ లో గుర్తిస్తే కరోనాగా చికిత్స
ఛాతీ స్కాన్ చూసినప్పుడు.. అందులో ఐదు స్థాయులను పరిశీలిస్తాం.
> ఐదో స్థాయిలో ఉంటే వందశాతం కొవిడ్ గానే పరిగణిస్తాం.2వ స్థాయి కంటే ఎక్కువగా ఉంటే కొవిడ్ లక్షణాలకు దగ్గరగా ఉన్నట్లుగా భావిస్తాం.
> సీటీ స్కాన్ ను పరిశీలించడం ద్వారా శ్వాసకోశాల్లో వైరస్ ఎక్కడెక్కడ వ్యాపించింది? దాని తీవ్రత ఎంతనేది తెలిసిపోతుంది.
> కొంచెం ఆలస్యమై నిమోనియా చేరితే..
అప్పుడు బ్రాంకోస్కోపీ చేసి శ్వాసకోశాల్లో ద్రావణాలను పరీక్షిస్తే అందులో కచ్చితత్వం ఎక్కువగా ఉంటుంది.
> బ్రాంకోస్కోపీ క్లిష్టమైన ప్రక్రియ. ఇది అందరిలోనూ సాధ్యం కాదు.
> కొవిడ్ లక్షణాలు తగ్గకపోతే.. సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రికి చేరడం ముఖ్యం.ఎందుకంటే.. వైరస్ తీవ్రత తగ్గినా.. దాని ప్రభావంతో శరీరంలోని రక్తనాళాల్లో వాపు (ఇన్ ఫ్లమేషన్ ) వస్తుంది.ఫలితంగా రక్తనాళాల్లో పొర దెబ్బతిని, రక్తప్రవాహానికి అడ్డంకులు ఏర్పడే అవకాశాలున్నాయి.
> వేర్వేరు కారణాల వల్ల పరీక్షల్లో నెగెటివ్ రావచ్చు.
> ఇది కొత్త జబ్బు కాబట్టి.. దీని పరీక్షలకు తగినంత నైపుణ్యం కూడా అవసరం.
> ఆర్ టీ-పీసీఆర్ లో 60-70 శాతమే కచ్చితత్వం ఉంటుంది.
> సాధారణంగా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన ( 0-5 ) రోజుల్లో ఎక్కువమందిలో లక్షణాలు కనిపించవు.
( 5-14 ) రోజుల్లో అంటే ఆ 10 రోజుల వ్యవధిలో లక్షణాలు వెలుగులోకి వస్తాయి.( 14-21) రోజుల్లో వైరస్ తగ్గడం మొదలవుతుంది. ( 21-28 ) రోజుల్లో పూర్తిగా వెళ్లిపోయి శరీరంలో యాంటీబాడీస్ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతాయి. ఈ సమయాల్లో ఎప్పుడు నమూనాను స్వీకరించామనే దానిపై కూడా ఫలితం ఆధారపడి ఉంటుంది.

■ కరోనా లేదని తేలినా.. ఎప్పుడు ఆసుపత్రికి వెళ్లాలి?

> ఆయాసం ఉన్నప్పుడు

> జ్వరం తగ్గకుండా వస్తున్నప్పుడు

> దగ్గు ఆగకుండా ఉన్నప్పుడు

> నీరసం, నిస్సత్తువ పెరిగినప్పుడు

> రక్తంలో ఆక్సిజన్ 94% కంటే తక్కువైనప్పుడు

■ ఎందుకిలా జరుగుతోంది?

> ప్రస్తుతం ఆర్ టీ-పీసీఆర్ , యాంటీజెన్ పరీక్షల ద్వారా కరోనాను నిర్ధారిస్తున్నారు.

> దీన్ని నిర్వహించడానికి, నమూనా సేకరణలోనూ తగిన నైపుణ్యం, శిక్షణ అవసరం.

> నమూనాను సరిగా సేకరించకపోయినా, తగినంత మోతాదులో తీయకపోయినా, తీసుకున్న నమూనాను ఎక్కువకాలం నిల్వ ఉంచినా, నిల్వ చేయడంలోనూ తగిన ప్రమాణాలు పాటించకపోయినా వైరస్ వృద్ధి చెందకముందే నమూనాను తీసుకున్నా.. ఫలితం తారుమారు కావచ్చు.
> ఉదాహరణకు కొన్నిసార్లు వైరస్ వచ్చిన తర్వాత 7-10 రోజుల మధ్య గనుక పరీక్ష చేయించుకుంటే.. అప్పటికే ఐజీఎం అభివృద్ధి చెందుతుంది. ఆ సమయంలో ఐజీఎం వైరస్ పై దాడి చేస్తుంటుంది. వైరస్ క్రమేణా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో గనుక పరీక్ష చేయించుకుంటే.. వైరల్ లోడ్ తక్కువగా ఉన్నప్పుడు నెగెటివ్ గా కనిపిస్తుంది.
> అంటే ఆ వ్యక్తిలో వైరస్ ఉన్నా పరీక్షల్లో వెల్లడయ్యే అవకాశాలు చాలా తక్కువ.

| DR.GOUTHAM VIDYAM M.D

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat