ఆస్పత్రుల్లో కరోనా చికిత్స, టీకా కోసం ఆధార్ కార్డు తప్పనిసరి కాదని UIDAI స్పష్టం చేసింది. ఆధార్ లేదన్న కారణంతో ఆస్పత్రుల్లో చేర్చుకోకపోవడం, టీకా, మందులు ఇవ్వకపోవడం లాంటివి చేయకూడదని పేర్కొంది.
ఏ వ్యక్తి అయినా, లబ్ధిదారుడైనా ఆధార్ లేకున్నా ఎమర్జెన్సీ సేవలు పొందొచ్చని తెలిపింది.
పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు, పింఛన్ డాక్యుమెంట్ చూయించి టీకా వేసుకోవచ్చని పేర్కొంది.