దేశంలో త్వరలో సింగిల్ డోసు టీకా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.
రష్యాకు చెందిన స్పుత్నిక్ లైట్ అనే సింగిల్ డోసు టీకా కోసం డాక్టర్ రెడ్డీస్, కేంద్రంతో చర్చలు జరుపుతోంది. అన్ని అనుమతులు లభిస్తే జులై నాటికి స్పుత్నిక్ లైట్ టీకా దేశంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
దీనికి రష్యాలో ఇప్పటికే అత్యవసర అనుమతి లభించింది. ఈ వ్యాక్సిన్ 79.4% సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు రష్యా తెలిపింది.