భోజనం చేసిన తరువాత కొన్ని పనులు చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది. తిన్న వెంటనే స్నానం చేయకూడదు. అలా చేస్తే కడుపులో గ్యాస్ మంట వస్తుంది.
తప్పనిసరైతే గంట తరువాత స్నానం చేయాలి. అలాగే, భోజనం చేసిన వెంటనే పండ్లు తినొద్దు. కాస్త గ్యాప్ ఇవ్వాలి. ఇక తినగానే ఎట్టి పరిస్థితుల్లో కూడా నిద్రపోకూడదు.
ఇలా చేస్తే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కడుపు నిండిన తరువాత వ్యాయామాలు చేయకూడదు. కాసేపు నడవడం ఉత్తమం.