సాధ్యమైనంత త్వరగా ప్రజలందరికీ టీకాలు వేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఉందని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు.
అవసరమైన వ్యాక్సిన్లను సేకరించేందుకు టీకా తయారు చేస్తున్న స్థానిక, అంతర్జాతీయ సంస్థలతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు.
కొవిడ్ నియంత్రణకు అవసరమైన అన్ని మందుల ఉత్పత్తిని పెంచాలని, అందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని ఫార్మా సంస్థల ప్రతినిధులకు నిన్నటి సమావేశంలో చెప్పారు.