DRDO భాగస్వామ్యంతో కరోనా బాధితుల చికిత్సలో వినియోగించే 2డీజీ డ్రగ్ను డా. రెడ్డీస్ ల్యాబ్ ఆవిష్కరించింది.
వచ్చేవారమే 10వేల డోసుల మొదటి బ్యాచ్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రెడ్డీస్, DRDO అధికారులు తెలిపారు.
పౌడర్ రూపంలో ఉండే ఈ డ్రగ్ను కరోనా రోగులు నీళ్లలో కలుపుకుని తాగితే కరోనా లక్షణాల నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుందని వెల్లడించారు. క్లినికల్ ట్రయల్స్లో మంచి ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు.