ఏపీలో పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని మాజీ మంత్రి,ఎమ్మెల్సీ నారా లోకేశ్ జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మరో 3 వారాల్లో పరీక్షలు ప్రారంభం కానున్నందున కరోనా ఉద్ధృతి దృష్ట్యా అందరినీ పాస్ చేయాలని సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి లేఖ రాశారు. తెలంగాణ సహా 12 రాష్ట్రాలు ఇప్పటికే పరీక్షలను రద్దు చేశాయని గుర్తు చేశారు.
విద్యార్థులు ఒత్తిడికి లోనవుతున్నారని, హైకోర్టు ఆదేశాలు లేదా ప్రతిపక్ష ఆందోళనల కంటే ముందే మానవత్వంతో ఆలోచించి, రద్దు చేయాలన్నారు….