తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 71,221 టెస్టులు చేయగా.. 4,693 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
ఇందులో 734 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 5,16,404కి చేరింది.
తాజాగా 33 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 2,863కి పెరిగింది. 6,876 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.కాగా రాష్ట్రంలో 56,917 యాక్టివ్ కేసులు ఉన్నాయి.