తెలంగాణ రాష్ట్రంలోని ముస్లింలకు సీఎం కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం.. శాంతి, ప్రేమ, దయను పంచుతోందన్నారు.
రాష్ట్రంలో గంగా జమునా తహజీబు రంజాన్ పండగ ప్రతీక అని చెప్పారు.
మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ముస్లింల జీవితాల్లో వెలుగును నింపుతున్నాయని చెప్పారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.