మహారాష్ట్రలో కరోనా మహమ్మారి శాంతించట్లేదు. కొవిడ్ కేసులతో పాటు వైరస్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.
గడచిన 24 గంటల్లో అక్కడ కొత్తగా 42,582 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా, 850 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదే సమయంలో 54,535 మంది కరోనా రోగులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,33,294 యాక్టివ్ కేసులు ఉన్నాయి. లాక్డౌన్ పెట్టిన కేసులు తగ్గట్లేదు.