కరోనా బాధితులకు టీకాల కొరత ఏపీలోనే కాదు దేశమంతటా ఉందని సీఎం జగన్ అన్నారు. డబ్బులు ఇస్తామని చెప్పినా టీకాలు ఇచ్చేందుకు ఫార్మా కంపెనీలు రెడీగా లేవని సీఎం జగన్ తెలిపారు.
టీకాల పంపిణీ కేంద్రం నియంత్రణలో ఉంటుందని తెలిసి కూడా ప్రతిపక్షాలు, మీడియా తమపై విమర్శలు చేస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాష్ట్రానికి దాదాపు 7 కోట్ల డోసులు ఇవ్వాల్సి ఉంటే ఇప్పటివరకు కేంద్రం నుంచి 73 లక్షల డోసులు మాత్రమే వచ్చాయని చెప్పారు.