తెలంగాణలో నేటి నుండి 10 రోజుల పాటు లాక్ డౌన్ అమలు కానుండగా.. వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు, అనుబంధ రంగాలు, వ్యవసాయ యంత్రాల పనులు, రైస్ మిల్లులకు లాక్ డౌన్ వర్తించదు.
FCIకి ధాన్యం పంపడం, ఫెర్టిలైజర్, విత్తనాల షాపులు, సంబంధిత రవాణా, విత్తన తయారీ కర్మాగారాలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది..
రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం యథావిథిగా కొనసాగించనుంది.